24 August, 2026 | 11:30 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

మత్తు పదార్థాలు కుటుంబాన్ని కూల్చేస్తాయి: డా.కూరపాటి రమేష్

27-06-2025 11:47 PM

హుజురాబాద్,(విజయక్రాంతి): యువత మత్తు పదార్థాలకు బానిసైతే కుటుంబాలు నాశనమవుతాయని డాక్టర్ కూరపాటి రమేష్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో మీ సాయిబాబా టెంపుల్ నుండి అంతర్జాతీయ మత్తు పదార్థాల దుర్వినియోగం, అక్రమ రవాణాన్ని పురస్కరించుకొని కూరపాటిహాస్పిటల్, హుజురాబాద్ ఐఎంఏ  ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో శుక్రవారం ర్యాలీ నీ IMA ప్రెసిడెంట్ dr సుధాకర్  జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా కూరపాటి రమేష్ మాట్లాడుతూ... యువత మత్తు పదార్దాలనుండి దూరంగా ఉండాలి. మత్తు పదార్థాలు జీవితాన్ని నాశనం చేస్తాయి. ఆరోగ్యన్ని పాడుచేస్తాయి. కుటుంబలను కూల్చేస్తాయని అన్నారు. 

మత్తు పదార్థాలవాడకాన్ని వ్యతిరేకం గా మనం అందరం ఒకవైపు నిలబడాలి. ఇలాంటి అవగాహణ కార్యక్రమాల ద్వారా సమాజం మొత్తానికి మంచి మార్గ నిర్దేశనం జరుగుతుందన్నారు. విద్యార్థులు, యువత ఈ సందేశాన్ని గుండెల్లో దాసుకోవాలి మన భవిష్యత్తు మనచేతుల్లో ఉంది. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఆరోగ్యాకరమైన జీవన శైలిని అవాలంభించాలి. మానవ సమాజాన్ని సమిష్టి గా పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా  ఉంది. మత్తు పదార్థాల రవాణా కూడా పూర్తిగా అరికట్టాలని తెలిపారు.