కన్నబిడ్డను కట్టెల పొయ్యిలో వేసి చంపిన తల్లి
24-02-2026 04:35 PM
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్‌గిరిలో(Medchal-Malkajgiri) దారుణం చోటుచేసుకుంది. కసాయి తల్లి కన్న బిడ్డను కట్టెల పోయ్యిలో వేసి చంపేసింది. ఓ తల్లి బౌరంపేటలో 2 నెలల కుమారుడిని దారుణంగా హింసించి పొట్టనపెట్టుకుంది. నిన్న రాత్రి నుంచి ఏడుస్తున్నాడని తల్లి కుమారుడి ప్రాణం తీసింది. బాలుడి నోట్లో గుడ్డలు కుక్కి.. కాళ్లు, చేతులు కట్టేసి పోయ్యిలో వేసింది. కుమారుడిని చంపడంపై భార్యతో భర్త గొడవపడ్డాడు. దంపతుల గొడవపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న దుండిగల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.




