కేరళ ఇకపై కేరళం
24-02-2026 04:19 PM
కేరళంగా కేరళ.. పేరు మార్పుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
న్యూఢిల్లీ: కేరళ రాష్ట్రం పేరును కేరళంగా( Kerala as Keralam) మార్చాలన్న కేరళ ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnaw) తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త ప్రధానమంత్రి కార్యాలయ సముదాయం సేవా తీర్థంలో జరిగిన తొలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేరళ రాష్ట్రం(Kerala State) పేరును 'కేరళం'గా మార్చే ప్రతిపాదనను ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని వైష్ణవ్ అన్నారు.




