23 May, 2026 | 2:54 PM

Breaking News

ఏఐసీసీ దృష్టిలో బెస్ట్ పీసీసీ తెలంగాణ   •   నేరెళ్ళ బాలికల గురుకులంలో బోధనా సిబ్బంది నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తంగళ్ళపల్లి సర్పంచ్   •   వినియోగదారులకు చేరువగా టీజీఎన్పీడీడీసీఎల్ యాప్   •   మండుతున్న ఎండలకు నిర్మానుష్యంగా దమ్మపేట మెయిన్ రోడ్డు   •   పుణ్య నాయక్ తాండ చింతలపూడి మధ్య వాగుపై వంతెన నిర్మించండి   •   రైతుల సమస్యలపై ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన   •   జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు   •   నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం   •   సహకార సంఘం ఎదుట జొన్న రైతుల నిరసన   •  

రైతుల సమస్యలపై ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన

23-05-2026 02:05 PM

భిక్కనూర్, మే22(విజయ క్రాంతి): భిక్కనూర్ బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్ నేతృత్వంలో శుక్రవారం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి వినతిపత్రం అందజేశారు. రైతుల వరి పంట కొనుగోలు, రైస్ మిల్లులకు తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం, రైస్ మిల్లుల వద్ద తూకం మధ్య వ్యత్యాసం రావడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. రైస్ మిల్లుల వద్ద వచ్చిన తూకం వ్యత్యాసంపై రైతులకు సరైన సమాచారం ఇవ్వకుండా డబ్బులు తగ్గుతున్నాయని సొసైటీ సిబ్బంది చెబుతున్నారని విమర్శించారు.

అలాగే రైస్ మిల్లుల వద్ద వడ్ల లారీలను అన్లోడ్ చేయడంలో యాజమాన్యాలు నిర్లక్ష్యం వహించడం వల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేయడం ఆలస్యం అవుతోందన్నారు. దీంతో రైతులు తరుగు రూపంలో మరియు ఇతర మార్గాల్లో నష్టపోతున్నారని పేర్కొన్నారు. వెంటనే స్పందించి రైస్ మిల్లుల వద్ద ధాన్యాన్ని త్వరగా అన్లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అత్తెల్లి తిరుమలేష్, పొన్నాల రంజిత్, లక్ష్మీదేవునిపల్లి గ్రామ సర్పంచ్ లింగారెడ్డి, జిల్లా కోశాధికారి రమేష్ రెడ్డి, బి. భాస్కర్, హెచ్. కరణ్, పి. భూపతి, నర్సింలు, గంధం రాజు, మెట్టు స్వామి, బాల్ లింగం, వివిధ గ్రామాల అధ్యక్షులు, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.