జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు
23-05-2026 02:04 PM
నిజాంసాగర్ మే 23( విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జొన్న రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని అచ్చంపేట ప్రాథమిక సహకార సంఘ ఆధ్వర్యంలో శనివారం నాడు నిజాంసాగర్ మండలంలోని మంగళూరు గ్రామంలో కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏ లే మల్లికార్జున్, సహకార సంఘ అధ్యక్షులు కయ్యం నరసింహారెడ్డి, ప్రారంభించారు. జొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు సూచించారు. కార్యక్రమంలో నిజాంసాగర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజాపండరి, స్థానిక సర్పంచ్ రాజు, సహకార సంఘ సీఈవో సంగమేశ్వర్ గౌడ్, నాయకులు చాకలి సాయిలు, తదితరులు పాల్గొన్నారు.






