23 August, 2026 | 2:43 AM

సేవా సంకల్ప్ అభియాన్‌కు బీజేపీ స్టేట్ చీఫ్

23-08-2026 01:20 AM
  1. సమావేశంలో సంస్థాగత కార్యకలాపాలపై చర్చ
  2. మోదీ నాయకత్వ ప్రస్థానం తెలిపేలా కార్యక్రమాలు

హైదరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రా వు శనివారం ఢిల్లీలోని పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్ లో ఉన్న ఆ పార్టీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన ‘సేవా సం కల్ప్ అభియాన్’ సమావేశానికి హా జరయ్యారు. బీజేపీ కార్యవర్గంలో నూతనంగా నియమితులైన జాతీ య పదాధికారులతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బీఎల్ సంతో ష్‌తోపాటు, శివ ప్రకాష్, సౌదాన్ సింగ్, వినోద్ తావ్డే తదితర సీనియర్ నాయకులు హాజరయ్యారు.

రప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ అధిపతిగా 25 సంవత్సరాల (సీఎం నుంచి పీఎం) నిరం తర నాయకత్వాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న ‘సేవా సంక ల్ప్ అభియాన్’లో భాగంగా దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన కార్యక్రమా లు, పార్టీ సంస్థాగత కార్యకలా పాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ  సమావేశంలో పార్టీ ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్, బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డీకే అరుణ, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎమ్మెల్సీ కొమరయ్య ఇతర నాయకులు పాల్గొన్నారు.