కేంద్రం నిర్ణయం సరైనదే
- దేశ వ్యతిరేక శక్తులను సీఎం ఎందుకు కలుస్తున్నారు?
- జొహ్రాన్ మమ్దానీతో నీకేం పని?
- ఎక్స్ వేదికగా బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు విమర్శలు
హైదరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): కేంద్ర విదే శీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీఎం రేవంత్ రెడ్డి అమె రికా పర్యటనకు అనుమతి నిరాకరించడం సరైన చర్యేన ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు తెలిపా రు. భారత వ్యతిరేక శక్తుల ప్రతినిధులను,
రాహుల్ గాంధీకి సైద్ధాంతిక గురువులుగా ఉన్న వ్యక్తులను కలిసేం దుకే ఈ పర్యటన తలపెట్టారనే విషయం ఇప్పుడు స్పష్ట మవుతోందన్నారు. భారత వ్యతిరేక వైఖరి కలిగిన న్యూ యార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీని కలవాల్సిన అవస రం సీఎం రేవంత్ రెడ్డికి ఏమొచ్చిందో తెలంగాణ ప్రజల కు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శని వారం రాంచందర్ రావు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ప్రతిపాదిత పర్యటనలో జొహ్రాన్ మమ్దానీతో భేటీ అవ కాశం ఉన్నప్పటికీ, ఆ వివరాలను అధికారిక షెడ్యూల్లో ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. ఇటీవల న్యూ యార్క్ పాకిస్థాన్ డే వేడుకల్లో మమ్దానీ పాల్గొన్నా రన్నారు. అయోధ్య రామమందిర భూమి పూజను వ్యతి రేకించారని చెప్పారు. తెలంగాణ ప్రజల మనోభావాల తో ముడిపడి ఉన్న ఈ అంశంపై సీఎం సమాధానం చెప్పాలని నిలదీశారు.






