calender_icon.png 13 July, 2025 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పర్యటనను విజయవంతం చేయాలి

12-07-2025 07:00:28 PM

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు..

కోదాడ: ఈనెల 14వ తేదీన సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు పర్యటనను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు(BJP State Vice President Sankineni Venkateshwar Rao) పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి పోలింగ్ బూత్ నుండి అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు తరలివచ్చి రాష్ట్ర అధ్యక్షుని పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. జిల్లా ప్రబారి రాజమౌళి, జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ కనగాల నారాయణ, రాష్ట్ర నాయకులు కనగాల వెంకటరామయ్య, నూనె సులోచన, కడియం రామచంద్రయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కిరాజు యశ్వంత్, హనుమంతరావు, ఓరుగంటి కిట్టు, జిల్లా జనార్ధన్ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.