12-07-2025 06:55:02 PM
హైదరాబాద్: రాజ్యాంగ రూపకల్పనలో డా.బీఆర్ అంబేద్కర్ అంశంపై ఓయాలో నిర్వహించిన సదస్సులో సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్ మాట్లాడుతూ... ఆర్టికల్ 32 రాజ్యాంగంలో అతి ముఖ్యమైందని, దానిని డా. బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ఆత్మగా పేర్కొన్నారని తెలిపారు. రాజ్యాంగ రచనకు దాదాపు మూడేళ్లు పట్టిందని, ఒకే పౌరుసత్వం ఉండాలని రాజ్యాంగ సభలో అంబేద్కర్ వాదించారన్నారు. ప్రాథమిక హక్కుల కల్పనలో అంబేద్కర్ తనదైన ముద్రవేశారని ఆయన గుర్తు చేశారు. అతి సమైఖ్య, అతి కేంద్రీకృత రాజ్యాంగాన్ని అంబేద్కర్ వ్యతిరేకించారని, ప్రభుత్వాలు ఎలా పనిచేయాలో ఆదేశిక సూత్రాలు చెబుతాయని పేర్కొన్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రాజ్యాంగం సవరణను అంబేద్కర్ అనుమతించారని బీఆర్ గవాయ్ వివరించారు.