20 June, 2026 | 2:36 AM

బీజేపీ బీఎల్‌ఏెే-2లకు ఎస్‌ఐఆర్‌పై శిక్షణ

20-06-2026 12:04 AM

ఓటరు జాబితా సవరణ, అర్హుల నమోదు లక్ష్యంగా ప్రత్యేక అవగాహన

నాగోల్, జూన్ 19 (విజయక్రాంతి): బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నాగోల్లోని శుభం కన్వెన్షన్ హాల్లో ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బిఎల్‌ఎ-2 ల కోసం ఎస్‌ఐఆర్ శిక్షణా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతం చేయడం, అర్హులైన ప్రతి ఓటరును ఓటరు జాబితాలో చేర్చడం, ఓటరు వివరాల్లోని తప్పులను సరిదిద్దడం, అనర్హుల పేర్లను తొలగించడం, అలాగే బిఎల్‌ఎ-2 లకు క్షేత్రస్థాయి అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎస్‌ఐఆర్ రాష్ట్ర కన్వీనర్ అశోక్ వేముల, మాజీ మంత్రి, ఎస్‌ఐఆర్ రాష్ట్ర కోఆర్డినేటర్ మర్రి శశిధర్ రెడ్డి, సీనియర్ నాయకులు పేరాల శేఖర్, పొన్న వెంకటరమణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, రంగారెడ్డి అర్బన్ జిల్లా ఎస్‌ఐఆర్ కన్వీనర్ గుర్రం చెన్నకేశవ రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ ఆలే భాస్కర్, మేడ్చల్ జిల్లా ప్రభారి సామ రంగారెడ్డి, ఎల్బీ నగర్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శులు భండారి భాస్కర్, యశ్పాల్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భండారి శైలజ, శ్రీదేవి రెడ్డి, మాజీ జిహెచ్‌ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి, మాజీ కార్పొరేటర్లు మొద్దు లచ్చిరెడ్డి, కళ్లెం నవజీవన్ రెడ్డి, కార్పొరేటర్లు, జిల్లా కార్యదర్శులు నరేష్ యాదవ్, నూతి శ్రీనివాస్ రావు, సీనియర్ నాయకులు, మహిళా మోర్చా, యువ మోర్చా నాయకులు పాల్గొన్నారు.