ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం
- ప్రతి 12 వారాల్లోపు గర్భిణీకి హెచ్‌పీసీఎల్ పరీక్ష చేయించాలి
- జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్
సికింద్రాబాద్, జూన్ 19 (విజయక్రాంతి) సికిల్ సెల్ అనీమియా అనేది వంశపారం పర్యంగా సంక్రమించే రక్త సంబంధ వ్యాధి అన్ని డాక్టర్ పుట్ట శ్రీనివాస్ తెలియజేశారు. గురువారంజిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రోగ్రామ్ ఆఫీసర్స్ , సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్స్, వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బంది, కార్యాలయ అధికారులు, సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీని ఉద్దేశించి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ ప్రతి వారాల్లోపుగర్భిణీకి హెచ్‌పీఎల్ పరీక్షలు చేయించాలని, వైద్యులకు, సిబ్బందికి సూచించారు.
ఈ వ్యాధిలో ఎర్ర రక్త కణాలు సాధారణ గుండ్రటి ఆకారంలో కాకుండా కొడవలి ఆకారంలో మారి శరీరానికి తగినంత ఆక్సిజన్ సరఫరా చేయలేవు అని తెలియజేశారు. సికిల్ సెల్ అనీమియా నివారణలో భాగంగా వివాహానికి ముందు మరియు గర్భధారణ సమయములో సికిల్ సెల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించాలని వైద్యాధికారులను, సిబ్బందిని కోరారు. వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన పెంచడం ఎంతైనా అవసరమని ఆ దిశగా అవగాహన కార్యక్రమలలూ చేపట్టాలని సూచించారు.
ముందస్తు నిర్ధారణ , మరియు సరైన వైద్య చికిత్స పొందడం ఎంతో అవసరం అని తెలియజేశారు.జన్యు సలహాలు (జెనెటిక్ కౌన్సిలింగ్) తీసుకోవాలని గర్భిణీ స్త్రీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీధర్ , జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి , అదనపు జిల్లా వైద్యాధికారి డా:అనిత ,డాక్టర్ సాయిబాబా సికిల్ సెల్ నోడల్ అధికారి, పోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ శ్రీకళ, జిల్లా మాస్ మీడియా అధికారి జక్కుల రాములు, వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బంది, క్యా కార్యాలయ అధికారులు,సిబ్బంది సుమారుగా 200 మంది పాల్గొన్నారు.






