5న ఆదిలాబాద్‌కు రాహుల్
ఎన్నికల ప్రచారానికి హాజరు
నేడు కోరుట్ల, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి సభలకు సీఎం
హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ నెల 5న రాష్ట్రానికి రానున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించే బహిరంగ సభకు రాహుల్ హాజరుకానున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఏఐసీసీ పెద్దలు ఇప్పటివరకు రాష్ట్రానికి రాలేదు. 5న రాహుల్‌గాంధీతో ఏర్పాటు చేసే సభ తర్వాత రాష్ట్రంలోని మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల్లో నిర్వహించే సభలకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా వస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కూడా రోజు రెండు, మూడు సభలకు హాజరవుతున్నారు. నేడు కోరుట్ల, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో పాల్గొననున్నారు.




