11-08-2025 12:00:00 AM
ఘట్ కేసర్, ఆగస్టు 10 : రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సూచన మేరకు, జిల్లా పార్టీ ఆదేశాల తో ప్రతి మున్సిపల్, మండల, కార్పొరేషన్లలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలో భాగంగా ఆదివారం పోచారం మున్సిపాలిటీలో మున్సిపల్ అధ్యక్షులు ననావత్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో కార్యశాల నిర్వహించడం జరిగింది.
మంగళ వారం తిరంగా ర్యాలీ మరియు స్వతంత్ర సమర యోధుల స్థూపాలు, అమర వీరుల స్తూపాలు శుద్ధి చేసి వారికి పూలమాలతో నివాళులు అర్పించటం ఇంటింటికి జాతీయ జెండా ఇచ్చి అట్టి జాతీయ జెండాను వారి ఇంటి పైన ఎగురవేయాలి అని నిర్ణయించడం జరిగింది.
ఈసమావేశానికి జాతీయ గిరిజన మోర్చా కార్యవర్గ సభ్యులు ననావత్ బిక్కు నాయక్, గొంగళ్ళ బాలేష్, ధరావత్ తౌర్యా నాయక్, మున్సిపల్ ఉపాధ్యక్షులు కన కచారి, గిరి, గొరిగే శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు కోన మల్లేష్, రేతి వెంకటేష్, కార్యదర్శి గంజి వంశీ కుమార్, బండారు రవి శంకర్, నూతన్ మిశ్రా, కవిత, సోషల్ మీడియా అనిల్ చారి, బూ త్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, విజయ, నజీర్, నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.