11-08-2025 12:00:00 AM
భారీ వర్షానికి కాలిన్లో ముంచెత్తిన వరద నీరు
బడంగ్ పేట్, ఆగస్టు 10 : మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్, మీర్పేట్ కార్పొరేషన్లు భారీ వర్షానికి పలు లోతట్టు కాలనీలు జలమలయ్యాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షం ఆయా కాలనీ లో వరద నీరు ముంచెత్తింది. పలు కాలనీలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందు లు ఏర్పడ్డాయి.
మీర్పేట్ పరిధిలోని పలు కాలనీవాసుల అవస్థలు వర్ణనాతీతం. గత రెండు రోజులుగా కాలనీ లో భారీ వర్షాల కారణంగా మిథిల్లా నగర్, సత్యసాయి నగర్ కాలనీ లో వరద నీరు ముంచోత్తడంతో ఇండ్లలోకి వరద నీరు చేరింది.కాలనీ మొత్తం నలువైపుల వరద నీరు చు ట్టూ ముట్టడంతో ఎప్పుడు ఏముంపు వస్తుందోనని కాలనీవాసులు ఆందోళనకు గురై రాత్రంతా జాగారం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
వరద నీరు కారణంగా ఇంట్లోని నిత్యవసర సరుకులు పూర్తి గా తడిసిపోవడంతో పాటు గృహోపకరణలు పూర్తిగా పనికి రాకుండా పోయాయని కాలనీవాసులు తమ ఆవేదనను వెళ్లిబుచ్చారు. కాలనీలో వరద నీరు ముప్పు తొలగించాలని పలు శాఖల అధికారులకు సమాచారం ఇచ్చిన ఇప్పటికి స్పందించడం లేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత కొంతకాలంగా కాలనీ లో వర ద ముంపు పరిస్థితి ఏర్పడుతుందని.... అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు విన్నవించిన పట్టించుకోవడంలేదని విమర్శించారు. అల్పపీడనం కారణంగా భారి వర్షాలు ఉండడంతో కాలనీవాసులు వణికిపోతున్నారు. అత్యవసర బయటికి వెళ్లాలన్నా వెళ్లలేని పరిస్థితి ఉందని కాలనీవాసి శ్రీనివాసులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలనీలో వరద నీరు సమస్యను తీర్చాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు.