calender_icon.png 13 August, 2025 | 9:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యంత వైభవంగా బోనాల పండుగ

11-08-2025 12:00:00 AM

ఘట్ కేసర్, ఆగస్టు 10 : బోనాల పండగను ఆదివారం పోచారం మున్సిపల్ పరిధిలోని కొ ర్రెముల, ముత్వెల్లిగూడ, కాచవానిసింగారం ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఉద యం నుంచి సాయంత్రం వరకు మహిళలు నైవేధ్యంతో కూడిన బోనాలతో శివసత్తుల పూనకాలతో వెంటరాగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలసి అమ్మవారి ఆలయాలకు చేరుకుని సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

ప్రజలు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయాలకు చేరుకోవడంతో భక్తజనులతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి. ఈ బోనాల ఉత్సవంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చామకూర భద్రారెడ్డి, పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.

సాయంత్రం యువకులు తీసిన తొట్టెల, పలహారపుబండి ఊరేగింపులు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, పోచారం, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రెడ్యానాయక్, మాజీ జెడ్పిటిసి మంద సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్ లు ఓరుగంటి వెంకటేష్ గౌడ్ కవిత, కొంతం వెంకటరెడ్డి, శివశంకర్, మాజీ ఉపసర్పంచ్ కందుల రాజు, మాజీ వార్డు సభ్యులు ఎరుకల దుర్గరాజ్ గౌడ్, బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నాగులపల్లి రమేష్, ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ బండారి ఆంజనేయులు గౌడ్, నాయకులు నల్లవెల్లి శేఖర్ , బద్దం జగన్ మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.