calender_icon.png 19 December, 2025 | 7:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్ లో బీజేపీ కార్యకర్తల ర్యాలీ

19-12-2025 06:04:37 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో సర్పంచుల సన్మాన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావుకు శుక్రవారం నిర్మల్ లో బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. నిర్మల్ ముధోల్ ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి రామారావు పటేల్ బిజెపి జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు కొండాపూర్ వద్ద స్వాగతం పలికి పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు