ఫీజుల బకాయిపై బీజేపీ లడాయి
08-08-2026 01:49 AM
చేవెళ్ల, ఆగస్టు 7 (విజయక్రాంతి): బీజేపీ యువ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గణేష్ ఇచ్చిన పిలుపు మేరకు, చేవెళ్ల మున్సిపల్ లోని వివేకానంద జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో ఫీజుల బకాయి బీజేపీ లడాయి కార్యక్రమం చేశారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు పురుషోత్తం రెడ్డి, బండారి చంద్రశేఖర్ రెడ్డి, బిజెపి ఎస్సీ మో ర్చా కార్యదర్శి అశోక్, నాయకులు అభిషేక్ రెడ్డి, వడ్డే గణేష్ తదితరులు పాల్గొన్నారు.






