8 August, 2026 | 2:52 AM

పోలీస్, ప్రజల భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకే ‘సహచరి’

08-08-2026 01:49 AM

ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ బాలస్వామి

ఘట్‌కేసర్, ఆగస్టు 7 (విజయక్రాంతి): పోలీస్, ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకే ‘సహచరి‘ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ బాలస్వామి తెలిపారు. మల్కాజిగిరి సీపీ సుమతి ఆదేశాల మేరకు ఘట్కేసర్ పీఎస్ పరిధి ఎన్‌ఎఫ్‌సి నగర్‌లోని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో మహిళల భద్రత, సాధికారత, సామాజిక అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా.. ఇన్స్పెక్టర్ బాలస్వామి, ఎస్‌ఐ లు శేఖర్, హీన, ట్రాఫిక్ ఏఎస్‌ఐ తిరుపతి రెడ్డి, ఉప్పల మహిళా పోలీస్ స్టేషన్ ఏఎస్‌ఐ స్వర్ణలత, సీడిఈడబ్ల్యూ కౌన్సిలర్ అర్చన పాల్గొని మహిళల భద్రత కోసం తెలంగాణ పోలీస్ శాఖ చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, మహిళలపై జరిగే నేరాల నివారణ, సైబర్ నేరాలపై అవగాహన, గృహ హింస, వేధింపులు, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా, మత్తు పదార్థాల దుష్ప్రభావాలు వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.