మాస్కోలో బ్లాక్ రెయిన్!
20-06-2026 12:00 AM
ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
మాస్కో, జూన్ 19: రష్యా రాజధాని మాస్కోలోని చమురు రిఫైనరీలు, ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్ 200 డ్రోన్లతో దాడులు చేసిన కొన్ని గంటల్లోనే ఆ ప్రాంతాల్లో నల్లటి వర్షం కురిసింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. వందలాది డ్రోన్లు ఒక్కసారిగా ప్ర యోగించడంతో ఆకాశం మొత్తం నల్లగా మారిపోయినట్లు తెలిపాయి.
అది నల్లటి బూడిద లాంటి వర్షమని, దీని కారణంగా ప్రజల్లో తలనొప్పి, శ్వాస సమస్యలు తలెత్తుతున్నాయని మాస్కో ప్రజలు వెల్లడించారు. వైమానిక దాడుల అనంతరం కురిసే ఈ వర్షం అత్యంత ప్రమాదకరమని స్థానిక వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నల్లటి వర్షాలు కురుస్తుండడంతో తలుపు లు, కిటికీలు మూసుకోవాలని, బయటకు రావద్దని ప్రజలకు సూచించారు.






