తాత్కాలిక నిషేధం సబబే
- టెలిగ్రామ్ పిటిషన్ కొట్టివేత
- ప్రభుత్వం చర్యలను సమర్థించిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ, జూన్ 19: టెలిగ్రామ్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ నెల 21న నీట్ పరీక్ష సజావుగా జరిగే వరకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బ్యాన్ నిర్ణయం సరైందేనని తేల్చి చెప్పింది. టెలిగ్రామ్ తమ యాప్‌ను బ్యాన్ చేయడం అన్యాయమంటూ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది.
ఈ నెల 21న నీట్-యూజీని నిష్పక్షపాతంగా తిరిగి నిర్వహించేందుకు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తన 39 పేజీల తీర్పులో సమర్థించింది. జస్టిస్ తేజస్ కారియా నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ వాదోపవాదాలను పరిశీలించి, టెలిగ్రామ్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ సందర్భంగా జస్టిస్ తేజస్ కరియా మా ట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం తీసుకున్న తాత్కాలిక నిషేధం చర్యకు పేర్కొన్న కారణాలు సరిపోతాయని పేర్కొన్నారు.
భారతదేశ సార్వభౌమాధికా రం, సమగ్రత, రక్షణ, దేశ భద్రత, విదేశాలతో స్నేహ పూర్వక సంబంధాలు, శాంతిభ ద్రతలు లేదా ఏదైనా తీవ్రమైన నేరానికి (కాగ్నిజబుల్ అఫెన్స్) ప్రేరేపించడాన్ని నిరో ధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదా దానిచే ప్రత్యేకంగా అధికారం పొందిన అధికారికి ఉందని తెలిపారు. ప్రభుత్వం తీసుకు న్న చర్యలు తక్కువ ఆంక్షలతో కూడినవేనని తెలిపారు. ఉత్తర్వులు అసమానమైనవేం కాద న్నారు. నీట్ వివాదం, వ్యవస్థీకృత మోసా లు, ఆందోళనల కారణంగానే ప్రభుత్వం తాత్కాలిక ఆంక్షలను విధించిందన్నారు.






