calender_icon.png 24 July, 2025 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా హోంగార్డు బ్లాక్‌మెయిల్..

06-12-2024 12:53:00 AM

*అరెస్ట్ చేసిన పోలీసులు

సిరిసిల్ల, డిసెంబర్ 5 (విజయక్రాంతి): అప్పుగా తీసుకున్న డబ్బులు ఇవ్వమని అడిగితే వారిని బ్లాక్‌మెయిల్ చేస్తున్న మహిళా హోంగార్డును పోలీసులు అరెస్ట్ చేశారు. వేములవాడ ఆలయంలో ఏఈగా రిటైర్డ్ అయిన శేఖర్ వద్ద హోంగార్డు వడ్ల అనూష్ రూ.3.50 లక్షలు అప్పుగా తీసుకుంది. ఆరు నెలల్లో వడ్డీతో సహా చెల్లిస్తానని నమ్మబలికింది. గడువు ముగిసినప్పటికీ డబ్బులు ఇవ్వకపోవడంతో శేఖర్ తన డబ్బులు ఇచ్చేయాలని పట్టుపట్డాడు.

దీంతో అనూష తనను శేఖర్ పెళ్లి చేసుకున్నట్టు తప్పుడు పెళ్లి పత్రికను, మార్ఫింగ్ చేసిన ఫొటోలతో అసత్య ప్రచారం చేస్తూ మరో రూ.5 లక్షలు ఇవ్వాలని వేధించింది. తన పరువు పోతుందోనని భయపడిన శేఖర్ రూ.5 లక్షలు ముట్ట జెప్పాడు. తిరిగి మరో రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో శేఖర్ పోలీసులను ఆశ్రయించాడు. కాగా 15 రోజుల క్రితం ఓ ఆటో డ్రైవర్ వద్ద చిట్టీ వేసిన అనూష.. చిట్టీ డబ్బులతోపాటు అదనంగా రూ.30 లక్షల వరకు వసూలు చేసింది.

దీనిపై ఆటో డ్రైవర్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో హోంగార్డును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. బెయిల్‌పై వచ్చిన అనూషను శేఖర్ ఫిర్యాదుతో తిరిగి రిమాండ్‌కు తరలించినట్లు టౌన్ సీఐ వీరప్రసాద్ పేర్కొన్నారు.