calender_icon.png 17 January, 2026 | 10:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుగ్గిళ్లలో ఉచిత పశువైద్య శిబిరం

17-01-2026 07:58:22 PM

బెజ్జంకి: ఉచిత పశువైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ గూగిల్ల మల్లయ్య పడి రైతులకు సూచించారు. శనివారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గుగ్గిళ్ళలో రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ళ మల్లయ్య, పశు వైద్య అధికారి హరిత తో కలిసి ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సంద్భంగా పశువైద్యురాలు డాక్టర్ హరిత మాట్లాడుతూ, పాడి పశువులకు పచ్చిమేత, దాణా, ఎండు మేతలను సమీకృతంగా అందించాలని,సరైన పోషణ అంతేనా పశువులు క్రమం తప్పకుండా చూడి నిలిచి, పాల దిగుబడి పెరుగుతుందని తెలిపారు. పాడి పశువులకు గర్భకోశ సంబంధిత వ్యాధులకు ఉచిత చికిత్స అందించడంతో పాటు, లేగ దూడలకు నట్టల నివారణ మందులను అందించారు. ఈ శిబిరంలో గ్రామ సెక్రటరీ ,ఉప సర్పంచ్, గోపాలమిత్ర, పాడి రైతులు, తదితరులు పాల్గొన్నారు