12 July, 2026 | 2:25 AM

మియాపూర్ ఫ్లైఓవర్ పనులను పరిశీలించిన సైబరాబాద్ జాయింట్ సీపీ సన్‌ప్రీత్ సింగ్

12-07-2026 12:00 AM

శేరిలింగంపల్లి,జులై 11 (విజయక్రాంతి): సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సన్ప్రీత్ సింగ్, (ఐపీఎస్) మియాపూర్ ఫ్లైఓవర్ మైహోమ్ మంగళ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.పనుల పురోగతి, ట్రాఫ్పి పడుతున్న ప్రభావాన్ని సమీక్షించిన ఆయన, ట్రాఫిక్ నిర్వహణకు అధికారులకు ముఖ్య సూచనలు చేశారు. ఎన్ హెచ్-65 మియాపూర్ నుంచి అల్ల్విన్ వరకు సర్వీస్ రోడ్ అభివృద్ధి కోసం ప్రతిపాదిత ట్రాఫిక్ డైవర్షన్ ప్రణాళికను పరిశీలించి, వాహనదారుల అసౌకర్యం తగ్గేలా ముందస్తు ప్రణాళికతో అమలు చేయాలని ఆదేశించారు.

డైవర్షన్ సమయంలో బ్యారికేడ్లు, హెచ్చరిక బోర్డులు, దిశా సూచికలు ఏర్పాటు చేసి, ట్రయల్ రన్ నిర్వహించి లోపాలు సరిదిద్దాలని సూచించారు.నిర్మాణ పనుల సమయంలో ట్రాఫిక్ నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆయన తెలిపారు.ఈ ఈ డ్రైవ్ లో డీసీపీలు శేషాద్రిని రెడ్డి, ఎస్. రవికుమార్, అదనపు డీసీపీ టి. హనుమత్ రావు, ఏసీపీ ఆది మూర్తి తదితరులు పాల్గొన్నారు.