19 August, 2026 | 3:58 AM

భారత్‌కు షాక్.. జురెల్‌కు గాయం

19-08-2026 12:00 AM

గాలే,ఆగస్టు 18 : శ్రీలంకతో తొలి టెస్టులో పట్టు బిగిస్తున్న టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో స్టార్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ గాయపడ్డాడు. నొప్పితో విలవిల్లాడుతూ మైదానం వీడాడు. లంక రెండో ఇన్నింగ్స్ 28వ ఓవర్లో మానవ్ సుతార్ బంతితో రంగంలోకి దిగి ఫ్లైటెడ్ డెలివరీని వేశాడు. దీంతో స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో దినుష బంతిని బలంగా బాదగా.. ఫీల్డర్ జురెల్ కాళ్లకు తాకింది.

అతడు నొప్పితో విలవిల్లాడగా ఫిజియో వచ్చి పరిశీలించాడు. నొప్పి తగ్గకపోవడంతో ఫిజియో సాయంతో జురెల్ మైదానాన్ని వీడగా.. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా సర్ఫరాజ్ ఖాన్ మైదానంలోకి వచ్చాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో జురెల్ హాఫ్ సెంచరీ (51) చేశాడు. అయితే, రెండో ఇన్నింగ్స్లో మాత్రం ఏడు పరుగులే చేసి అవుటయ్యాడు.