18 August, 2026 | 1:15 AM

భారత్‌ భారీ ఆధిక్యం

18-08-2026 12:00 AM
  1. భారత్‌కు భారీ ఆధిక్యం
  2. ఆకట్టుకున్న లంక పోరాటం
  3. దినుష సెంచరీ, డిక్‌విల్లా హాఫ్ సెంచరీ

గాలె వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టుబిగించింది. వర్షం అంతరాయం కలిగిస్తున్న ఈ మ్యాచ్‌లో మూడోరోజు శ్రీలంక తడబడి నిలబడింది. ఓవర్ నైట్ స్కోరుకు మరో 2 పరుగులు జోడించి ఆలౌటవగా, తర్వాత లంకను భారత స్పిన్నర్లు కంగారెత్తించారు. అయితే డిక్‌విల్లా, దినుష పోరాటంతో కోలుకుంది. అయితే చివరి సెషన్‌లో భారత స్పిన్నర్లు పుంజుకోవడంతో లంక ఇన్నింగ్స్‌కు తెరపడింది. నాలుగోరోజు భారత్ ఎంత వేగంగా రన్స్ చేస్తుందనే దానిపై విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

  1. శ్రీలంక 284 ఆలౌట్
  2. రాణించిన సుతార్, జడేజా

గాలె, ఆగస్టు 17 : శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. బ్యాటింగ్‌లో భారీస్కోరు సాధించిన టీమిండియా తర్వాత బౌలింగ్‌లోనూ అదరగొట్టింది. భారత్ ఆలౌటైన వెంటనే ఇన్నింగ్స్ ప్రారంభించిన లంకను భారత బౌలర్లు కంగారెత్తించారు. ఆరంభం నుంచే వరుస వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు. ఖాతా తెరవకుండానే ఓపెనర్ నిస్సాంకను సిరాజ్ ఔట్ చేశాడు. ఇక్కడ నుంచి భారత స్పిన్నర్లు తమ మ్యాజిక్ చూపించారు.

చందిమాల్ 4, కమిందు మెండిస్ 14, ఉదార 27 పరుగులకు వెనుదిరిగారు.ధనంజయ డిసి ల్వా కూడా నిలదొక్కుకునేందుకు జడేజా పెవిలియన్‌కు పంపించాడు. దీంతో లంక 90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఇక 150 లోపే లంక తొలి ఇన్నింగ్స్‌కు తెరపడుతుందనుకుంటున్న దశలో సోనాల్ దినుష, వికెట్ కీపర్ డిక్‌విల్లా అద్భుతంగా పోరాడారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు.

వీరిద్దరూ ఆరో వికెట్‌కు 146 పరుగులు జోడించారు. వీరి పార్టనర్ షిప్ కార ణంగానే లంక స్కోరు 280 దాటగలిగింది. అప్పటి వరకూ తమ స్పిన్ మ్యాజిక్‌తో వరు స వికెట్లు తీసిన కుల్దీప్ , జడేజా, సుతార్ వీరి పార్టనర్ షిప్ ను బ్రేక్ చేయలేకపోయారు. ఫలితంగా చివరి సెషన్ వరకూ వీరి బ్యాటింగ్ కొనసాగింది. ఈ క్రమంలో ఇద్ద రూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. చివరికి 80 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర డిక్ విల్లాను ప్రసిద్ధ కృష్ణ ఔట్ చేయడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది.

తర్వాత టెయిలెండర్లతో కలిసి దినుష స్కోరు పెంచాడు. ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకుని అదే స్కోరు దగ్గర ఔటయ్యాడు. తర్వాత మిగిలిన టెయిలెండర్లను ఔట్ చేసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఫలితంగా శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 4 వికెట్లు, జడేజా 3 వికెట్లు, కుల్దీప్ , ప్రసిద్ధ కృష్ణ , సిరాజ్ ఒక్కో వికెట్ తీశారు. దీంతో భారత్‌కు 178 పరుగుల కీలక ఆధిక్యం దక్కింది.

ఒక దశలో ఫాలోఆన్ ఆడుతుందనుకున్న లంక ఈ విధంగా పోరాడడం మూడోరోజు ఆటలో హైలెట్‌గా నిలిచింది. అయినప్పటీ ఈ మ్యాచ్‌లో ప్రస్తు తం టీమిండియా ఫలితాన్ని శాసించే స్థితినే ఉంది. మూడోరోజు మరో 13 ఓవర్ల ఆట మిగిలి ఉన్నప్పటకీ వెలుతురు మందగించడంతో త్వరగానే ముగించాల్సి వచ్చిం ది. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టలేదు. నాలుగోరోజు భారత్ ఎంత వేగం గా పరుగులు చేసి లంక ముందు భారీ లక్ష్యా న్ని నిర్థేశిస్తుందో చూడాలి. 

స్కోరు బోర్డు 

భారత్ తొలి ఇన్నింగ్స్ : 460 ( పడిక్కల్ 167 , రాహుల్ 82 , జురెల్ 51, పంత్ 39 జైస్వాల్ 32, ప్రబాత్ జయసూర్య 4/109, కేశర నువంత 3/175 )

శ్రీలంక తొలి ఇన్నింగ్స్ : 284 (దినుష 100, డిక్‌విల్లా 80, ఉదార 27, మానవ్ సుతార్  4/76. జడేజా 3/57)