రెండో రౌండ్‌లో లక్ష్యసేన్
- ప్రీ క్వార్టర్‌కు గాయత్రి, ట్రిసా జోడీ
- బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్
న్యూఢిల్లీ, ఆగస్టు 18 : ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. రెండో రోజు పోటీల్లో పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్, మహిళల సింగిల్స్‌లో మన ప్లేయర్స్ ముందంజ వేశారు. మహిళల డబుల్స్ విభాగంలో గాయత్రి గోపీచంద్--ట్రీసా జాలీ జోడీ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. 16వ సీడ్ లారెన్ లామ్, ఆలిసన్ లీ (అమెరికా)ను గాయత్రి జోడీ వరుస గేమ్స్‌లో 21--15, 21--12 తేడాతో ఓడించింది. అలాగే పురుషుల సింగిల్స్‌లో యువ షట్లర్ లక్ష్యసేన్ రెండో రౌండ్‌లో అడుగుపెట్టాడు.
తొలి రౌండ్‌లో అతడు 16--21, 21--8, 21-1-4 తేడాతో కొల్లిన్స్ ఫిలిమోన్ (ఆస్ట్రియా)పై విజయం సాధించాడు. తొలి గేమ్‌లో పోరాడి ఓడిన లక్ష్యసేన్.. తర్వాత రెండు గేమ్స్‌లో అద్భుతంగా ఆడి ప్రత్యర్థిని చిత్తుగా ఓడించాడు. మహిళల సింగిల్స్‌లో ఉన్నతి హుడా రౌండ్ ఆఫ్ 32కు దూసుకెళ్లింది. థెట్ తుజార్తో జరిగిన హోరాహోరీగా సాగిన పోరులో ఉన్నతి 22--20, 21--16 తేడాతో గెలుపొందింది.
మహిళల డబుల్స్ రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో సెల్వం-సిమ్రాన్ సింఘి జోడీ 7--21, 14--21 తేడాతో గాబ్రియేలా స్టోవాస్టెఫానీ స్టోవా (బల్గేరియా) చేతిలో పరాజయం చవిచూసింది. మిక్సిడ్ డబుల్స్ తొలి రౌండ్‌లో అసిత్ సూర్య-అమృత ప్రముత్తేష్ జోడీ పోరాడి ఓడింది. 71 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన పోరులో సోన్మెజ్-యాసెమెన్ బెక్తాస్ (తుర్కియే) చేతిలో భారత ద్వయం 21--16, 29--30, 22--24 తేడాతో ఓటమి పాలైంది. ఇదే విభాగంలో తొలి రౌండ్లో రోహన్ కపూర్-రుతివ గద్దె ద్వయం 22-20, 19--21, 17--21 తేడాతో జోనాథన్ లై-క్రిస్టల్ లై (కెనడా) చేతిలో పోరాడి ఓడింది..






