బీఎన్‌ఐ హైదరాబాద్ ప్రపంచ రికార్డు
- ఒకేసారి రెండు చాప్టర్లు ప్రారంభం
- ఇదొక చారిత్రాత్మక మైలురాయి
- సంస్థ ఈడీ సంజనా షా
హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): నమ్మకమైన వ్యాపార వృద్ధి విధానానికి కేరాఫ్‌గా బీఎన్‌ఐ నిలిచి, 76 దేశాలలో బీఎన్‌ఐ నెట్‌వర్క్‌లో హైదరాబాద్ రీజియన్ ప్రపంచ రికార్డు సృష్టించి సరికొత్త చరిత్రను ఆవిష్కరింపచేసిందని సంస్థ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ సంజనా షా అన్నారు. ఆదివారం బీఎన్‌ఐ ఆల్ఫా బీఎన్‌ఐ అఫినిటీ పేరుతో మాదాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో రెండు చాప్టర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా సంజనా షా మాట్లాడుతూ.. లాస్ ఏంజిల్స్, న్యూయార్క్, లండన్, ముంబై, సింగపూర్ వంటి 76 దేశాల్లో బిజనెస్ హబ్‌లు విస్తరించి నెట్‌వర్క్ ప్రపంచరికార్డు సాధించడం ఎంతో గర్వకారణమన్నారు.
ప్రారంభించిన నూతన రెండు చాప్టర్లు వ్యాపారాన్ని మరింత బలోపేతం చేస్తాయన్నారు. ప్రారంభంలోనే 500కు పైగా వ్యాపార రెఫరల్స్‌ను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న రీజియన్లలో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఎన్‌ఐ హైదరాబాద్ ఏరియా డైరెక్టర్ సతీష్ కుమార్, సీనియర్ లాంచ్ డైరెక్టర్ కవల్జీత్ సభర్వాల్, లాంచ్ డైరెక్టర్ సంగీతా సేగు, లాంచ్ అంబాసిడర్ అర్చన కల్వల తదితరులు పాల్గొన్నారు.
బీఎన్‌ఐ..
నాలుగు దశాబ్దాలకుపైగా చరిత్ర కలిగిన బీఎన్‌ఐ ప్రపంచంలో అతిపెద్ద బిజినెస్ నెట్వర్కింగ్, బిజినెస్ రెఫరల్ సంస్థ. 76 దేశాలలో 3.56 లక్షల పైగా సభ్యులను కలిగి ఉంది. కేవలం గత 12 నెలల్లోనే సభ్యుల మధ్య 1.78 కోట్ల (17.8 మిలియన్) రెఫరల్స్ మార్పిడి జరిగాయి. ‘గీవర్స్ గెయిన్’ అనేది బీఎన్‌ఐ ప్రధాన సిద్ధాంతం.
ఇది తన సభ్యులకు నెట్‌వర్కింగ్, పరస్పర సహకారం, వ్యాపార ఆలోచనలను పంచుకోవడంతో పాటు ‘బిజినెస్ రెఫరల్స్’ పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. భారతదేశంలో బీఎన్‌ఐ ప్రవేశించి ఇరవై ఏళ్లు పూర్తి కావస్తుంది. ప్రస్తుతం దేశంలోని 144 నగరాల్లో 73,392 మంది సభ్యులు ఉన్నారు. ఇక బీఎన్‌ఐ హైదరాబాద్ పదమూడేళ్ళ ప్రస్థానంలో 3,500 పైగా సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద రీజియన్‌గా నిలిచి గ్లోబల్ రికార్డును సొంతం చేసుకుంది.






