సిటీ సివిల్ కోర్టులో ఘనంగా బోనాలు
హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో తెలంగాణ రాష్ట్ర ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీక అయిన బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిటీ సివిల్ కోర్టు ముఖ్య న్యాయమూర్తి శశిధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జాతీయ కార్యదర్శి ఎస్.వి. సుబ్బయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరబాబు, సెంట్రల్ నాజర్ సాయి కుమార్, కృష్ణ యాదవ్, వర్మ, నరేష్ యాదవ్, ఉదయ్, మనీష్, శ్రవణ్, సంధ్య బోనాల వేడుకల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. ఈ వేడుకల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని అన్ని సివిల్ కోర్టుల న్యాయాధికారులు, కోర్టు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు.






