కువైట్‌లో 42 భవనాల కూల్చివేత
నిరాశ్రయులైన ఉత్తర తెలంగాణ ప్రవాసులు
కామారెడ్డి, జూలై 19 (విజయక్రాంతి): కువైట్‌లోని జిలీబ్ ఆల్ షుయూక్ ప్రాంతం లో ప్రమాదకరంగా ఉన్న ౪౨ పురాతన భవనాలను ఆదివారం అక్కడి యంత్రాంగం నేలమట్టం చేసింది. దీంతో బతుకుదెరువుకు ఆ ప్రాంతానికి వెళ్లి ఆయా భవనాల్లో అద్దెకు ఉంటున్న ఉత్తర తెలంగాణ ప్రవాసులు నిరాశ్రయులయ్యారు. వీరిలో ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ఎక్కువ. ముందస్తు నోటీసులిచ్చి కూల్చివేశామని అధికారులు చెబుతుండగా, కట్టుబట్టల తో రోడ్డున పడ్డామని బాధితులు వాపోతున్నారు.
ప్రత్యామ్నాయంగా ఇతర భవనా లకు అద్దెకు వెళ్దామంటే, అద్దెలు ఆకాశాన్నంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తింట్లోకి అద్దెకు వెళితే నెలకు సంపాదించిన సొమ్ములో అధిక మొత్తం అద్దెలకే వె ళ్తుందని చెబుతున్నారు. మొత్తం 42 భవనా ల్లో మున్సిపాలిటీ 15 భవనాలు కూల్చివేయగా, ఐదు భవనాలను ఇంటి యజమానులే నేలమట్టం చేశారు. మరో 22 భవనాలను భద్రత దళాలు కూల్చివేశాయి. ఈ అంశంపై భారతదేశ ప్రభుత్వంతోపాటు తెలంగాణ ప్రభుత్వం స్పందించి కువైట్ ప్రభుత్వానితో సంప్రదింపులు జరిపి, తక్కు వ అద్దెకు ఇళ్లు ఇప్పించాలా చొరవ తీసు టకోవాలని బాధితులు కోరుతున్నారు.






