3 June, 2026 | 2:00 AM

బోధన్ ఆర్డీఓ జెండా ఆవిష్కరణ

03-06-2026 01:26 AM

బోధన్, జున్ 2 (విజయక్రాంతి): తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా బోధన్ ఆర్డిఓ కార్యాలయంలో బోధన్ నందు, ఫ్లాగ్ హాయిస్టింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమతి యం. విజయ కుమారి, ఆర్డీవో బోధన్, జండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిపాలన అధికారి పి. వెంకటేష్, బోధన్ తహశీల్దార్ పి. విఠల్, ఎటిఓ బోధన్, రెవిన్యూ సిబ్బంది, ట్రెజరీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు, రిటైర్డ్ ఉద్యోగులు, స్థానికులు పాల్గొన్నారు.