calender_icon.png 10 November, 2025 | 12:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో బొలెరో డ్రైవర్ మృతి

10-11-2025 11:22:20 AM

చిలుకూరు: సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో కోదాడ హుజూర్నగర్ జాతీయ రహదారిపై(National Highway) అందు వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన చిలుకూరు మండలం పరిధిలో మిట్స్ కాలేజ్ సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ నుండి సత్తుపల్లి వెళ్తున్న టీఎస్ 04 యు సి 33 88 నెంబర్ గల లారీ ఆంధ్ర నుండి వెళ్తున్న టీఎస్ 33 టీ 25 44 నెంబర్ గల బొలెరో వాహనాలు తెల్లవారుజాము అయిదు గంటల సమీపంలో రెండు వాహనాలు ఢీకొనడంతో బొలెరో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.