10-11-2025 12:52:10 PM
ఉల్లిగడ్డ బస్తాలు ఎత్తుకెళ్తున్న ప్రయాణికులు.
చిట్యాల,(విజయక్రాంతి): జాతీయ రహదారి 65(National Highway 65) పై నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద ఉల్లిగడ్డల లారీ హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్స్ సురక్షితంగా బయటపడ్డారు. అయితే అటుగా వెళుతున్న ప్రయాణికులు మాత్రం వారి వాహనాలను పక్కన నిలిపి ఉల్లిగడ్డ బస్తాలను ఎత్తుకెళ్లారు. లారీ బోల్తా పడి డ్రైవర్, క్లీనర్ ఇబ్బందుల్లో ఉండగా, మానవత్వం మరిచి దొరికిందే అవకాశం గా భావించి ఇలా ఉల్లిగడ్డ బస్తాల ఎత్తుకెళ్లడం పలువురిని విస్మయానికి గురిచేసింది.