30-12-2025 02:24:11 PM
లక్షెట్టిపేట,(విజయక్రాంతి): పట్టణంలోని సిఎస్ఐ చర్చి గేటు ముందు స్కూల్ విద్యార్థులను తరలిస్తున్న ఆటోని బొలెరో ట్రాలీ ఢీకొనడంతో ఆటో కల్వర్టులో పడి ఆరుగురు విద్యార్థులకు గాయాలైనట్లు స్థానిక ఎస్ఐ గోపతి సురేష్ ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన రామస్వామి అనే ఆటో డ్రైవర్ తన ఆటోలో ప్రతి రోజు భగత్ సింగ్ నగర్ కు చెందిన 9 మంది విద్యార్థులను లక్షెట్టిపేట పట్టణంలోని బాలికల పాఠశాల, బాలుర పాఠశాలకు తరలిస్తుండగా సిఐసిఐ చర్చ్ గేటు ముందు లక్షెట్టిపేట వైపు నుంచి ఆంధ్రబోర్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం ఢీకొనడంతో ఆటో రోడ్డు పక్కన ఉన్న కెనాల్ లో పడిపోయిందన్నారు.
వెంటనే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించి గాయపడ్డ విద్యార్థులను లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కొంతమంది విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వం ఆసుపత్రికి వైద్యుల సూచన మేరకు పంపించారు. ఆటో డ్రైవర్ రామస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.