calender_icon.png 30 December, 2025 | 3:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్న పోచారం దంపతులు

30-12-2025 02:21:38 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాదులోని ఎర్రగడ్డ (ఎస్ఆర్ నగర్)లోని శ్రీ విజయలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం ఉత్తర ద్వారం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పుష్పమ్మ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు పోచారం దంపతులను ఘనంగా సన్మానించి స్వామి వారి ఆశీర్వాదం అందజేశారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతులు  రాష్ట్ర ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు.