11 August, 2026 | 4:11 PM

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

19-06-2024 12:38 AM

అప్రమత్తమై హై అలర్ట్ ప్రకటించిన అధికారులు 

రాజేంద్రనగర్, జూన్ 18 (విజయ క్రాం తి): శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు మెసేజ్ రావడం కలకలం సృష్టించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఎయి ర్‌పోర్టు అధికారులు ఎయిర్‌పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. వివరాల ప్రకారం.. శం షాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లుగా ఓ అగంతకుడు మంగళవారం ఒంటి గంటకు ఈము|మెయిల్ సందే శం పంపించాడు. దీంతో అధికారులు అప్రమత్తమై ఎయిర్‌పోర్టులో హై అలర్ట్ ప్రకటిం చారు. భద్రత అధికారులు, సీఐఎస్‌ఎఫ్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిం చారు. ఎయిర్‌పోర్టుకు వచ్చే ప్రయాణికులతో పాటు వాహనాలను విస్తృతంగా తని ఖీలు చేశారు. చివరికి ఏం లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎయిర్‌పోర్టు అధికారిక ఈయు వచ్చిన మెసేజ్‌పై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఆర్‌జీఐఏ పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.