17 April, 2026 | 8:29 PM

Breaking News

సోనాల బస్టాండ్ లో చలివేంద్రం ఏర్పాటు   •   ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో అరైవ్-అలైవ్ సేఫ్టీపై అవగాహన   •   మా పట్టా భూమిలో ఎటువంటి నిర్మాణం చేపట్టొద్దు: పుట్ట వెంకటమ్మ   •   ప్రభుత్వమే మమ్ములను సమ్మెలోకి నెట్టుతుంది   •   స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం   •   మున్సిపల్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజు   •   పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నాల్గవ సెమిస్టర్ పరీక్ష రుసుము నిర్ధారణ   •   ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి వివోఏలకు అవగాహన   •   శాతవాహనలో నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   మల్లాపూర్‌లో బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దహనం   •  

అల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్‌లో ఘనంగా బోనాల ఉత్సవాలు

28-06-2025 12:00 AM

కొత్తపల్లి, జూన్27(విజయక్రాంతి): స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో వేడుకగా నిర్వహించినటువం టి అల్ఫోర్స్ బోనం ఉత్సవా లు కన్నుల పండుగగా జరిగాయి. బోనాల పండుగ తెలంగాణ రాష్ట్రానికి ప్రతీకాని, కులమతాలకు అతీతంగా జరుపుకునేటువంటి పండుగని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత, విఎన్‌ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ వి.నరేందర్ రెడ్డి అన్నారు.

ఆషాడమాసంలో జరుపుకునే బోనాల పండుగ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా గొప్పగా వేడుకగా కుటుంబ సభ్యుల మధ్యన దేదీప్యమానంగా జరుపుకుంటారని తెలిపారు. ఆషాడమాసంలోని ప్రతి ఆదివారం రోజున వివిధ రూపాలలో మహంకాళి మాతను కొలుస్తారని ఆ సాంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తూ అమ్మలను గన్న ఆ అమ్మ యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండే విధంగా పూజలు చేస్తారనివారుచెప్పారు.