14-07-2025 01:49:24 AM
హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): ఆషాడ మాసం బోనాల పండుగ సందర్భంగా ఆదివారం కవాడిగూడలోని జిహెచ్‌ఎంసి గ్యారేజీ పార్కింగ్ యార్డులో స్వచ్ గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియ న్ అధ్యక్షుడు బండారి యాదగిరి ఆధ్వర్యంలో బోనాల పండుగ వేడుకలను ఘనం గా జరుపుకున్నారు. గ్యారేజ్ లోని శ్రీ మహంకాళి దేవాలయం, ఉప్పలమ్మ దేవాలయంలోని అమ్మవార్లకు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాలు సమర్పించి తమ మొక్కలు తీర్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్‌ఎస్ సీనియర్ గ్రేటర్ నాయకుడు ఎమ్మెన్ శ్రీనివాసరావు, కవాడిగూడ కార్పొరేటర్ రచన శ్రీ, బిఆర్‌ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు రాంబాబు యాదవ్, మాజీ కార్పొరేటర్ వి. శ్రీనివాస్ రెడ్డి, బిజెపి ఓ బి సి మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పూసరాజు హాజరై అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులను తీర్చుకున్నారు. ఈ సందర్భంగా పోతరాజులు చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్వచ్ గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బాబు, నాయకులు నర్సింగ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మతసామరస్యానికి ప్రతీక ఉర్సూ ఉత్సవాలు
ఉర్స్ ఉత్సవాలు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆదివారం ముషీరాబాద్ దాయార కమాన్ వద్ద గల హజ్రత్ బందగి మియాన్ షా-ఎ-ఖాసీం ముజాహిద్ 404 ఉర్స్ ఉత్సవాలను పురస్కరించుకొని దాయ ర కమాన్ వద్ద జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లీంలతో కలిసి సామూహిక ప్రార్థనలు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం ఉర్స్ ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ప్రజలలో ఐక్యతను, మతసామరస్యాన్ని పెంపొందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహా, బీఆర్‌ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్, డివిజన్ మాజీ అధ్యక్షుడు సయ్యద్ హమ్మద్ భక్తియార్, జావీద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.