14-07-2025 01:48:23 AM
హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే పార్టీ కమిటీలు వేయాలని పార్టీ అధిష్ఠానానికి వరంగల్ కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. కమిటీల్లో చోటు దక్కని వారు ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేసే ప్రమాదం ఉందని జిల్లాకు చెందిన మెజార్టీ నాయకులు అభిప్రాయపడినట్లుగా తెలిసింది. ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్‌చార్జ్‌గా ఉన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధ్యక్షతన ఆదివారం గాంధీభవన్‌లో జిల్లా సమావేశం జరిగింది.
జిల్లాకు చెందిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీలు బలరాంనాయక్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, మురళీనాయక్, నాయిని రాజేందర్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణ, రేవూరి ప్రకాశ్ రెడ్డితో పాటు ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నా యక్, ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్య నా యకులు హాజరయ్యారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు జిల్లాలో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించే వ్యూహంపై చర్చించారు.
జిల్లాలో పార్టీ నాయకుల మధ్య నెలకొన్న పంచాయితీని ఒకరిద్దరు నాయకులు ప్రస్తావించే ప్రయ త్నం చేయగా మంత్రి లక్ష్మణ్‌కుమార్ వారించినట్లు తెలిసింది. సమావేశంలోని ఎజెండా మేరకే మాట్లాడాలని, ఇతర అంశాల జోలికి వెళ్లొద్దని సున్నితంగా సూచించడంతో పార్టీ సమావేశం సజావుగా జరిగినట్లుగా సమాచారం. గ్రామ, మండల, జిల్లా, బ్లాక్ కమిటీల జాబితాను త్వరలోనే ఇవ్వాలని, కానీ కమిటీలను మాత్రం ఎన్నికల తర్వాత ప్రటించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు.
పలువురి అసంతృప్తి?
ఎంపీ బలరాంనాయక్‌పై ఎమ్మెల్యే మురళీనాయక్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా సమాచారం. పార్టీ పదవులు కొందరికి వచ్చేలా చేస్తున్నారని ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేయగా, అలాంటిదేమీ లేదని ఎంపీ సమాధానం ఇచ్చారు. జిల్లాలకు వివిధ కమిటీల పేరుతో ఇన్‌ఛార్జిలను పంపిస్తున్నారని, ఎవరికి ఏమి సమాధానం చెప్పాలో ఆర్థం కావడంలేదని ఒకరిద్దరు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
మం త్రి లక్ష్మణ్‌కుమార్ జోక్యం చేసుకుని ఏఐసీసీ ఆదేశాల మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలను విజయవంతం చేసేం దుకు పార్టీ అధిష్టానం జిల్లాలకు ఇన్‌చార్జిలను నియమించిందని, పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు నియోజక వర్గాల వారీగా బాధ్యతలు అప్పగించిందని వివరించారు.