15-07-2025 12:00:00 AM
ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
శేరిలింగంపల్లి,జూలై 13: ఆషాఢ మాసం అమ్మవారి బోనాల సంబురాలు అంబరాన్నంటాయి. శేరిలింగంపల్లి డివిజన్ లోగల ఆదర్శ్ నగర్ కాలనీలోని శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్ల మ్మ తల్లి ఆలయంలో బోనాల పండుగను పురస్కరించుకుని ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్ టెంపుల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వ హించిన ఎల్లమ్మ కళ్యాణం,బోనాల ఉత్సవంలో పాల్గొన్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్.
అనంతరం ప్ర త్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రజ లంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో వెదజిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు.
బోనాల పండుగను ప్ర శాంతత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్,రాజేశ్వరమ్మా,డాకయ్య గౌడ్,గోపాల్ యాదవ్,మహేందర్ గౌడ్, ఆదర్శ్ నగర్ ఎల్లమ్మ టెంపుల్ కమిటీ సభ్యు లు భక్తులుపాల్గొన్నారు.