గుండ్లపోచంపల్లిలో బోనాల సంబురం
10-08-2026 12:27 AM
మేడ్చల్ అర్బన్, ఆగస్టు 9 (విజయక్రాం తి): మేడ్చల్, గుండ్లపోచంపల్లిలో శ్రీ పోచమ్మతల్లి బోనాల పండుగ ఉత్సవాలను ఘ నంగా నిర్వహించారు. ఆదివారం మేడ్చల్, గుండ్లపోచంపల్లి పట్టణాల్లో శ్రీ నల్లపోచమ్మ తల్లి ఆలయం వద్ద ఆషాఢ బోనాల పండుగ సందర్భంగా మహిళలు పెద్దఎత్తున తరలివెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో గుండ్లపోచంపల్లి పట్టణ కాం గ్రెస్ పార్టీ మాజి అధ్యక్షులు శ్రీనివాస్, మేడ్చ ల్ కాంగ్రెస్ నేత వెంకటేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు భానుచందర్, భాస్కర్, లక్ష్మీనారాయ ణ స్వామి, ఆలయం డైరెక్టర్ ఉదయ్ గౌడ్, కాంగ్రెస్ యువ నాయకులు పాల్గొన్నారు.






