ఘనంగా వన భోజనాలు
మెట్ పల్లి, ఆగస్ట్9 (విజయక్రాంతి): పట్టణంలో ఆదివారం ఆషాడ బోనాల సందర్బంగా పలు కుల సంఘాల ఆధ్వర్యంలో వన భోజనాలు జరిగాయి. గంగాపుత్ర సంఘాల ఆధ్వర్యంలో ఐదు చేతుల పోచమ్మ అమ్మవారికి బోనాల పండుగ పురస్కరించుకొని గంగ పుత్రులు గుల్లెండ్లతో ఊరేగింపుగా ఊరి పోచమ్మ, చావడి వద్ద, భూమాత అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి బోనాలతో బెల్లపు అన్నంతో నైవేద్యంతో మొక్కులు చెల్లించారు. అలాగే ఇరవై వార్డ్ లో గుంటుక సదశివ్ ఆధ్వర్యంలో, ఇంద్రనగర్ లో కుల సంఘాలు ఘనంగా మొక్కులు చెల్లించారు.
ఈ కార్యక్రమంలో కుల సంఘం పెద్దలు నర్సయ్య, ఉపేందర్,భూరం లక్ష్మన్, మత్స్య పారిశ్రామిక అధ్యక్షులు పర్రే శంకర్ గంగపుత్ర సంఘ అధ్యక్షులు ఆర్మూర్ నరేందర్ మాన్కాల చిన్నయ్య పర్మి నరసయ్య సుం కేట విజయ్ మాన్కాల పోచయ్య ఆర్మూర్ రాజేష్ పారుపల్లి శంకర్ పారుపల్లి కిషన్ పారుపల్లి రమేష్ నాగయ్య దీపక్ బొబ్బిలి శ్రీనివాస్ లోకేష్ రవి పోచయ్య ఆర్మూర్ రాజేష్ రాజేశ్వర్ వాల్ గోట్ సాయిలు పారిపెళ్లి కిషోర్ లక్ష్మణ్ పర్రి రతన్ గంగపుత్ర సంఘ సభ్యులు పాల్గొన్నారు..






