9 August, 2026 | 1:33 AM

సర్వజ్ఞ పాఠశాలలో బోనాలు

09-08-2026 12:00 AM

హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): ఖమ్మం పట్టణం విడిఒస్ కాలనీలోని సర్వజ్ఞ పాఠశాలలో తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బోనాల పండుగను అట్టహాసంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ ఆర్.వి. నాగేం ద్ర కుమార్, పాఠశాల కరస్పాండెంట్ కె. నీలి మ మాట్లాడుతూ.. ‘బోనాలు కేవలం పండుగ మాత్రమే కాదు, ఇదొక సామూహి క వేడుక. ఊరంతా కలిసి అమ్మవారిని కొలిచి, పల్లకి సేవలు, పోతరాజుల విన్యాసాలు, ఆడపడుచు నృత్యాలు,డప్పుల శబ్దా లతో సందడిగా జరుపుకుంటారు. బోనాల పండుగ భక్తి శ్రద్ధలకు, సామూహిక సంతోషానికి ప్రతీక’ అని చెప్పారు.