9 August, 2026 | 1:35 AM

రాజకీయాలకు అతీతంగా కూకట్‌పల్లి అభివృద్ధి కోసం పాటుపడుదాం: బండి రమేష్

09-08-2026 12:00 AM

కూకట్ పల్లి, ఆగస్టు 8,( విజయ క్రాంతి): కూకట్పల్లి అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి పనిచేయాలని, ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయంగా పోరాడుదాం అని టిపిసిసి ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ అన్నారు. వసంత నగర్ డివిజన్ విశ్వంభర కాలనీలో శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లో జరిగిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలప్పుడు పోరాడుదాం ప్రస్తుతం నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును తాను కోరినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని మైసమ్మ చెరువు,ఐడియల్ చెరువు, కాముని చెరువు, సున్నం చెరువులను హైడ్రా సహకారంతో ఆక్రమణల నుంచి విముక్తి కల్పించి, వాటిని సుందరీకరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించేందుకు సిఎంసి కమిషనర్ సృజన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కమిషనర్ తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వసంత నగర్ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మా కినేని యాక నారాయణ, సాయిబాబా చౌదరి, రంగమోహన్, చావా శ్రీనివాస్, గోపాల్ చౌదరి, మాధవరెడ్డి, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.