9 August, 2026 | 1:34 AM

అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ స్వతంత్ర వైఖరి కొనసాగించాలి

09-08-2026 12:00 AM

ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు 

ముషీరాబాద్,ఆగస్టు 8 (విజయక్రాంతి): దేశ స్వతంత్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ స్వతంత్ర వైఖరిని కొనసాగించాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం హిమాయత్నగర్లోని ఇస్కాఫ్ రాష్ట్ర కార్యాలయంలో ఇర్పా అమెరికా యుద్ధంభారత్పే ప్రభావం అంశంపై సయ్యిద్ అజీజ్ పాషా అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు.

నెహ్రూ కాలంలో అనుసరించిన అలీన విధానాన్ని పునరుద్ధరించాలని, అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గకుండా స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగించాలని సూచించారు.ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ మాట్లాడుతూ పశ్చిమాసియా భారత్కు ఆర్థిక, ఇంధన, భద్రతా పరంగా కీలక ప్రాంతమని, అక్కడి పరిణామాల నేపథ్యంలో జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేలా సమతుల్య విదేశాంగ విధానం అవసరమన్నారు.

ఇస్కాఫ్ జాతీయ అధ్యక్షులు, మాజీ ఎంపీ సయ్యిద్ అజీజ్ పాషా మాట్లాడుతూ ప్రపంచ శాంతి, సాంస్కృతిక స్నేహభావం, సమైక్యత కోసం ఇస్కాఫ్ పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో ఇస్కాఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ పదిహరి, మాజీ రాయబారి టి. సురేష్, రాష్ట్ర అధ్యక్షులు కాడారు ప్రభాకర్ రావు, ప్రధాన కార్యదర్శి ఆర్. గోపాల్, పి.వి. దుర్గ ప్రసాద్, ఏ. విజయలక్ష్మి, కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.