20 July, 2026 | 8:39 PM

విజ్ఞాన జ్యోతిని వెలిగించేవి కథలు

20-07-2026 02:05 AM
  1. ప్రజా గ్రంథాలయంలో జాతీయ స్థాయి పోటీలు
  2. మాతృమూర్తి పేరుతో నాలుగు లక్షల విరాళం
  3. పోటీకి 4000 కథలు
  4. ఎమ్మెల్సీ కోదండరాం, ఓఎస్‌డీ వేముల శ్రీనివాసులు

భీమదేవరపల్లి (హనుమకొండ), జూలై 19 (విజయక్రాంతి): కథలు విజ్ఞానజ్యోతిని వెలిగిస్తాయని ప్రపంచంలోని నలు దిశల నుంచి  జాతీయస్థాయిలో జరుగుతున్న కథల పోటీలకు హాజరు కావడం ఎంతో విశేషమని ఎమ్మెల్సీ కోదండరాం, ఓఎస్‌డీ వేముల శ్రీనివాసులు అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములకనూరులోని ప్రజా గ్రంథాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను ఓఎస్‌డీ వేముల శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయస్థాయి కథల పోటీల్లో విదేశాల్లో ఉన్నవారు సైతం పాల్గొనడం వారికున్న మక్కువను తెలియజేస్తుందన్నారు. ఇప్పటివరకు 4వేల కథలు రావడం విశేషమన్నారు.

కథల వల్ల వ్యక్తుల వ్యక్తిత్వ వికాసం పెరుగుతుందని, సమాజానానికి మంచి ఉపదేశం ఇచ్చినట్లవుతుందని, మానవాళి మనుగడ ప్రభావితం అవుతాయని అన్నారు. ఈ సంవత్సరం కథల పోటీల్లో పాల్గొనే వారికి 83 మందికి నగదు అవార్డును అందిస్తామన్నారు. దేశానికి దిక్సూచి లా పనిచేసే విధంగా కవులు, కథా రచయితలు పనిచేస్తున్నారని కొనియాడారు. గ్రంథాలయం నిర్వహణకు తన మాతృమూర్తి వేముల అనసూయ పేరు మీద నాలుగు లక్షలు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో గ్రంథాలయం నిర్వాహకులు వంగ రవీందర్, సుద్దాల సంపత్, పల్ల ప్రమోద్ రెడ్డి, చొల్లేటి సంపత్, కోడూరి సుగుణాకర్, ఎదులాపురం తిరుపతి, మాడుగుల కొమురయ్య, గొల్లపల్లి లక్ష్మయ్య, శంకర్‌రావు, సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డితో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కథ రచయితలకు నగదు బహుమతి అందించారు.