8 August, 2026 | 3:26 AM

ఫ్యూచర్ సిటీకి సెంటు భూమి కూడా ఇవ్వం..

08-08-2026 01:52 AM

ముచ్చర్ల రైతుల తేల్చివేత

కందుకూరు, ఆగస్టు 7 (విజయక్రాంతి): ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చి ఇప్పటికే తీవ్రంగా నష్టపోయామని ముచ్చర్ల మాజీ స ర్పంచ్ ఉటు పద్మ మరియు స్థానిక నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఫ్యూచర్ సిటీ భూసేకరణ కోసం గ్రామంలో రెవెన్యూ టీజిఐఐసి అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం భూములు ఇస్తే తగిన నష్టపరిహారం చెల్లిస్తామని కందుకూరు ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, టీజీఐఐసీ అధికారులు హామీ ఇచ్చినప్పటికీ, రైతులు దానిని ఖరాకండిగా తిరస్కరించారు.

తమకు పరిహారం వద్దని, ఏది ఏమైనా తమ భూములను వ దులుకునేది లేదని రైతులు స్పష్టం చేశారు. టీజీఐఐ సీ కి 301 ఎకరాలు కాదు కదా, కనీసం మూడు సెంట్ల భూమిని కూడా ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ ప్రభుత్వాన్ని సైతం నిలదీస్తామని హెచ్చరించారు. గతంలో ఎదురైన నష్టాల దృష్ట్యా ఫ్యూచర్ సిటీ భూ సేకరణపై ముచ్చర్ల గ్రామ రైతులు ఆర్డీవో, టీజీఐఐసీ అధికారుల ముందే ఏకగ్రీవంగా తమ వ్యతిరేకతను తెలిపారు.