28-07-2025 12:30:42 AM
తుర్కయంజాల్, జులై 26:తుర్కయంజాల్లో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం అమ్మవారికి మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. పో తురాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాలతో బోనాల ఊరేగింపు కొనసాగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయరారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పాడిపంటలతో, సుభిక్షంగా విలసిల్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తుర్కయంజాల్ మాజీ సర్పంచ్ చెవుల దశరథ, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాతిరి ఎల్లేశ్, నాయకులు చెవుల నరేందర్, ఓనమాల చక్రపాణి, ఓనమాల వేణుగోపాల్, కడారి గణేష్, రావుల యాదయ్య, కడారి రాజు, శీలం లక్ష్మయ్య, తావుల జగన్, చెవుల విష్ణు, నల్లవెల్లి కార్తీక్, ఎడ్ల దామోదర్, భానుప్రసాద్, మహిళలు పెద్ద ఎత్తునపాల్గొన్నారు