calender_icon.png 28 July, 2025 | 5:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండాపూర్‌ రేవ్‌ పార్టీ కీలక సూత్రధారి అరెస్ట్

28-07-2025 11:06:10 AM

హైదరాబాద్: కొండాపూర్‌ రేవ్‌ పార్టీలో(Kondapur Rave Party) కీలక సూత్రధారి అప్పికట్ల అశోక్‌కుమార్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్‌, గంజాయి, కండోమ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ అలవాటు ఉన్న యువతులే టార్గెట్‌ గా రేవ్‌ పార్టీని ఫ్లాన్ చేశారు. అశోక్ కారుకు లోక్‌సభ ఎంపీ స్టిక్కర్‌(Lok Sabha MP Sticker) అంటించుకుని తిరుగుతున్నాడని పోలీసులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ నిర్వహించాలని ప్లాన్ చేసినందుకు శనివారం రాత్రి తొమ్మిది మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

నిఘా వర్గాల సమాచారం ఆధారంగా, నిషేధ ఎక్సైజ్ శాఖ రాష్ట్ర టాస్క్ ఫోర్స్ రూట్ వాచ్ నిర్వహించి కొండాపూర్ ప్రాంతంలో డ్రగ్స్ పార్టీని ఛేదించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డ్రగ్ పార్టీలు నిర్వహించే కీలక నిందితుడు, ఇతర నిందితులైన పెడ్లర్లతో కలిసి ప్రతిపాదిత పార్టీ కోసం సర్వీస్ అపార్ట్‌మెంట్ బుక్ చేసుకున్నట్లు ఒక అధికారి తెలిపారు. నిందితుల నుంచి రేవ్ పార్టీకి ఉద్దేశించిన 2.080 కిలోల ఎండు గంజాయి, 50 గ్రాముల ఓజీ కుష్ (హైబ్రిడ్ గంజాయి), ఇతర మాదక ద్రవ్యాలు, ఎల్‌ఎస్‌డీ బ్లాట్ పేపర్లను ఎస్‌టీఎఫ్ బృందం స్వాధీనం చేసుకున్నట్లు అధికారి తెలిపారు. నివేదిక ప్రకారం, 11 మందిపై కేసు నమోదు చేయబడింది. తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశారు, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ విషయంపై తదుపరి దర్యాప్తు జరుగుతోంది.