28-07-2025 12:30:15 AM
ఖమ్మం, జులై 27 (విజయ క్రాంతి ): ఆపదలోనూ నేను న్నా అని మరోమారు చాటుకున్నారు తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వైరారోడ్డులోని ఎస్‌ఆర్ గార్డెన్స్ సమీపంలో ఆదివారం సాయంత్రం కారు ఢీకొన్న ప్రమాదంలో రెండు ద్వి చక్రవాహనాలపై ప్రయాణిస్తున్న నలుగురు యువకులకు తీవ్రగాయాలు అయ్యాయి.
ఇదే సమయంలో కొత్తగూడెం నియోజవకర్గ పర్యటనను ముగించుకుని ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయానికి వస్తున్న మంత్రి పొంగులేటి ఆ ఘటనను చూసి కాన్వాయ్ ను ఆపారు. అధైర్యపడొద్దని నేనున్నా నని ప్రమాదంలో గాయపడిన యువకులకు భరోసా ఇచ్చా రు. అక్కడే ఉన్న ట్రాఫిక్ సీఐ సాంబశివరావును దగ్గరకు పిలిచి క్షతగాత్రులను త్వరగా కిమ్స్ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. పైసా ఖర్చు లేకుండా మెరుగైన వైద్యం అందించాలని ఫోన్ ద్వారా వైద్యులనుఆదేశించారు.