calender_icon.png 28 July, 2025 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులాల్లో ఫుడ్‌పాయిజన్ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలి

28-07-2025 12:32:15 AM

షాద్ నగర్,జులై 27 : రాష్ట్రంలో తరచుగా గురుకుల, వసతి గృహా ల్లో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకోవడం బాధాకరమని ఏఐఎస్‌ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ ఆవేదన వ్య క్తం చేశారు. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లాలో గురుకులాలో ఫుడ్ పా యిజన్ గురై 70 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఇలాం టి ఘటనపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

తరచుగా వసతి గృహాలు ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్న సంబంధిత అధికారులు ఎందుకు అప్రమత్తంగా ఉండడం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఇలాంటి ఘటనల పై ప్రత్యేక చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాల తరఫున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు.